దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా మన తెలుగు హీరో ప్రభాస్ దేశంలోనే మోస్ట్ పాపులర్ హీరో అని ప్రకటించింది ఆర్మాక్స్ సంస్థ. అలాగే హీరోయిన్లలో టాప్ ప్లేస్‌ను సమంత కొట్టేసింది. అక్టోబరులో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటుల జాబితాను ప్రకటించింది. దీనిలో ప్రభాస్, సమంతలు మొదటి స్థానంలో ఉండగా, హీరోల జాబితాలో కోలీవుడ్ హీరో విజయ్, మూడవ స్థానంలో షారుక్ ఖాన్ ఉన్నారు. హీరోయిన్లలో రెండవస్థానంలో అలియాభట్, మూడవ స్థానంలో నయనతార నిలిచారు. వరుస సినిమా అప్‌డేట్స్‌తో ప్రభాస్ సందడి చేస్తుండడంతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్‌తో, వరుస ఇంటర్యూలతో సమంత తొలి స్థానంలో నిలిచింది.

- November 21, 2024
0
183
Less than a minute
You can share this post!
editor