త్రివిక్రమ్‌కి ఇష్టమైన నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు…

త్రివిక్రమ్‌కి ఇష్టమైన నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు…

హీరో విజయ్ దేవరకొండకి యూత్‌లో ఎలాంటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ కోసం తాను ఎదురు చూస్తుండగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. మరి గత సినిమా ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో బిజీగా ఉంటూనే లేటెస్ట్‌గా తాను ఈ దీపావళి కానుకగా రిలీజ్‌కి రానున్న “లక్కీ భాస్కర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. మరి దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించాడు.  ఈ సినిమా ఈవెంట్‌కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఎటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్‌లో విజయ్‌పై త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. విజయ్ తనకి బాగా నచ్చిన నటుల్లో ఒకడు అని అలాగే చాలాతక్కువ టైం లోనే విజయ్ ఎంత ప్రేమని పొందాడో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చూశాడని వ్యాఖ్యానించారు.

administrator

Related Articles