థండర్‌ బోల్ట్స్ ట్రైలర్ రిలీజ్

థండర్‌ బోల్ట్స్ ట్రైలర్ రిలీజ్

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతున్న తాజా సినిమా  థండర్‌బోల్ట్స్, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ నుండి కొత్త సూపర్ హీరోస్ వస్తున్నారు. ఈ సినిమాకు జేక్ ష్రెయిన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, ఓల్గా కురిలెంకో, పుల్‌మాన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మే 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. అవెంజర్స్ అమెరికాను విడిచివెళ్లి అనంతరం నగరానికి కొత్త సూపర్ హీరోల అవసరం వస్తుంది. దీంతో అమెరికన్ రక్షణ విభాగం ఈ బాధ్యతలను సెబాస్టియన్ స్టాన్ (వింటర్ సోల్జర్)కి అప్పగించగా.. వింటర్ సోల్జర్ థండర్ బోల్ట్స్ అంటూ ఒక టీమ్‌ని తయారు చేస్తారు. ఇక ఈ థండర్ బోల్ట్స్ అమెరికాను ఎవరి నుండి రక్షిస్తుంది. ఈ టీమ్ చేసే సాహసాలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

editor

Related Articles