‘ధూం ధాం’ సినిమా ఈ నెల 8న రిలీజ్..

‘ధూం ధాం’ సినిమా ఈ నెల 8న రిలీజ్..

చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్‌ కలిసి జంటగా నటించిన సినిమా ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకుడు. ఎంఎస్‌ రామ్‌కుమార్‌ నిర్మాత. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఆద్యంతం అద్భుతమైన కామెడీతో సినిమా తీశారని ఆయన ప్రశంసించారు. చక్కటి వినోదంతో పాటు తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ట్రైలర్‌ బాగా వచ్చింది. గోపీసుందర్‌ బాణీలు హిట్ అయ్యాయి. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కించామని, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: గోపీసుందర్‌.

administrator

Related Articles