సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సుశీల కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం స్వగ్రామం తెనాలిలో జరగనున్నాయి. సుశీల మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. చిన్ని కృష్ణకు తన తల్లి అంటే ఎంతో ప్రేమాభిమానాలు. అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన ఎన్నో కవితలు కూడా రాశారు. జన్మ జన్మకూ నీకే కొడుకునై పుట్టాలి అమ్మా అంటూ మదర్స్ డే సందర్భంగా చిన్ని కృష్ణ భావోద్వేగంతో కూడిన వీడియో షేర్ చేశారు.
- December 25, 2024
0
167
Less than a minute
Tags:
You can share this post!
administrator

