మహేష్ సినిమా కోసం కెన్యా వెళ్లిన ఎస్.ఎస్ రాజ‌మౌళి

మహేష్ సినిమా కోసం కెన్యా వెళ్లిన ఎస్.ఎస్ రాజ‌మౌళి

మ‌హేష్ మూవీ కోసం కొత్త ప్రదేశాలు వాటి ప్రాముఖ్యతలను బేరీజు వేస్తున్న రాజమౌళి.. కెన్యా నేష‌న‌ల్ పార్క్‌లో ఎస్.ఎస్ రాజ‌మౌళి అన్ని ప్రదేశాలను చూసి షూటింగ్‌కై కొన్నిటిని సెలెక్ట్ చేస్తున్నారు. ఎస్‌.ఎస్ రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB29 అంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని అటు Mahesh బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను త‌ల‌పించేలా ఈ సినిమా తీయబోతున్నట్లు రాజ‌మౌళి ఇప్ప‌టికే చెప్పేశారు. ఈ సినిమాను రూ.1,000 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యా దేశంలోని అంబోసెలీ నేష‌న‌ల్ పార్క్‌ను సంద‌ర్శించాడు. ఈ మూవీ షూటింగ్‌కు స‌రిపోతుందా లేదా అనేది తెలియడానికి జ‌క్క‌న్న ఈ ప్రాంతానికి వెళ్లి పరిశోధిస్తున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఒక ఫొటోను షేరు చేశారు.. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుండడం ఖాయం.

administrator

Related Articles