“సాయి దుర్గా తేజ్ కొత్త ప్రపంచం… షాక్ అవుతారా..?

“సాయి దుర్గా తేజ్ కొత్త ప్రపంచం… షాక్ అవుతారా..?

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కొత్త చిత్రం ఊహకు అందని స్థాయిలో గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే సినీ ప్రియుల్లో భారీ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా కేవలం మరో ప్రాజెక్ట్ కాదు… యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తుల చుట్టూ తిరిగే ఒక మిస్టీరియస్ ప్రపంచాన్ని తెరపైకి తీసుకురాబోతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది.

దర్శక ద్వయం సుజిత్ – సందీప్ ఈ చిత్రాన్ని అత్యంత విజువల్ గ్రాండ్యూర్‌తో, హై-ఆక్టేన్ కథనంతో తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అంబిషస్‌గా రూపుదిద్దుకుంటోంది.

పోస్టర్‌లో కనిపించిన యోధుడు, ఆకాశ గోళాలు ఈ సినిమా స్కేల్‌పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అసలు ఈ కథలో దాగిన సీక్రెట్ ఏమిటి? ప్రేక్షకులను ఏ రేంజ్‌లో సర్ప్రైజ్ చేయబోతోంది? ఈ ప్రశ్నలతోనే ఈ చిత్రం విడుదలకు ముందే ఒక గ్రాండ్ స్పెక్టకిల్‌గా మారుతోంది..!

Related Articles