నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రం నుంచి విడుదలైన ‘రామ’ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ స్థాయిలో రూపొందించిన విజువల్స్, భారీ యుద్ధ సన్నివేశాలు సినిమా స్కేల్‌ను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన ఫ్రేమ్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. డిఎన్ఈజీ సంస్థ అందించిన గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 దీపావళికి విడుదల కానుంది. ఈ గ్లింప్స్ తో బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

