ఎక్కువగా నిద్రపోయాను అంటే అది జైలులోనే-సల్మాన్‌ఖాన్

ఎక్కువగా నిద్రపోయాను అంటే అది జైలులోనే-సల్మాన్‌ఖాన్

తాను జైలులో మాత్రమే మంచిగా నిద్రపోయినట్లు చెప్పుకొచ్చారు హీరో సల్మాన్‌ఖాన్. తన మేనల్లుడు అర్హన్ ఖాన్ నిర్వహించిన దంబ్ బిర్యానీ అనే పాడ్‌కాస్ట్‌లో చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు సల్మాన్‌ఖాన్. ఈ పాడ్‌కాస్ట్‌లో భాగంగా సల్మాన్ మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్నప్పుడే ఎక్కువగా నిద్రపోయినట్లు వెల్లడించాడు. నాకు సాధారణంగా అందరిలాగా నిద్రపట్టదు. పడుకుంటే గంటన్నర లేదా రెండు గంటలు మాత్రమే నిద్రపోతాను. ఆపై ఏదో ఒకరోజు నెలకు ఒకసారి, ఏడు గంటలు నిద్రపోతాను. షూటింగ్‌లో ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు షాట్ల మధ్య నిద్రపోతాను. షూటింగ్‌లో కుర్చీలపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎక్కువగా నిద్రపోయింది జైలులో ఉన్నప్పుడే. అక్కడ అయితే ఏ ఇబ్బంది లేకుండా 8 గంటలు నిద్రపోయేవాడిని.

editor

Related Articles