కంగువ లాంటి సినిమా ఎవరూ ఇంతవరకూ చూసి ఉండరు: హీరో సూర్య

కంగువ లాంటి సినిమా ఎవరూ ఇంతవరకూ చూసి ఉండరు: హీరో సూర్య

 హీరో సూర్య  యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. ఈ మూవీకి శివ డైరెక్షన్ చేస్తున్నారు. కంగువ నవంబర్‌ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతోంది. ప్రయోగాత్మక సినిమాలు చేసే అతికొద్దిమంది స్టార్ యాక్టర్లలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  ఒకరు. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్‌ సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య చిట్‌ చాట్‌లో చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. కంగువ గురించి సూర్య మాట్లాడుతూ.. ఉత్తమమైన సినిమాలు అందించేందుకు ఎప్పుడూ గజినీ, సింగం, 24, జై భీమ్‌ లాంటి సినిమాలు చేసే ప్రేరణతో మాకు మేం ముందుకెళ్తుంటాం. కంగువ లాంటి సినిమాను మనలో ఎవరూ ఇప్పటివరకూ చూసి ఉండరు. 170 రోజులు షూటింగ్ సాగింది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా కంగువ. మీ అందరి నుండి అదే ప్రేమను పొందుతామని ఆశిస్తున్నానన్నాడు సూర్య. ఇప్పుడీ కామెంట్స్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫిమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. కంగువ ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇంగ్లీష్‌తో సహా ఎనిమిది భాషల్లో విడుదలకావడానికి సిద్ధమౌతోంది.

administrator

Related Articles