మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన పలు సెన్సేషనల్ హిట్స్‌లో నటుడు అలాగే దర్శకుడు కూడా అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ సినిమా “లూసిఫర్” కూడా ఒకటి. కొన్నేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మళయాళంలో విడుదలైన వసూళ్ల పరంగా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాని తెలుగులో అప్పట్లోనే డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ చిరంజీవి ఈ సినిమాని “గాడ్ ఫాదర్” పేరిట తెలుగులో రీమేక్ కూడా చేశారు. అయితే ఒరిజినల్ సినిమాకి పృథ్వీరాజ్ సీక్వెల్‌ని కూడా ప్రకటించాడు. మరి ఈ సినిమా ఫైనల్‌గా ఎప్పుడు రిలీజ్ అనేది ఇప్పుడు తెలిసింది. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ సినిమాని వచ్చే ఏడాది March 27న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

- November 1, 2024
0
27
Less than a minute
Tags:
You can share this post!
administrator