వెర్సటైల్ స్టార్ Allari Naresh హీరోగా ‘కనక దుర్గ’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కంటెంట్ స్టూడియోగా గుర్తింపు పొందిన Applause Entertainment టాలీవుడ్లోకి ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. భక్తి ప్రధాన కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బి.వి.ఎస్. రవి కథ అందించగా, దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్. రవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ భారతీయ దేవతల ఆధారంగా దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్కరించనుంది. భక్తి, యాక్షన్, భావోద్వేగాలు కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
- April 7, 2026
0
3
Less than a minute
You can share this post!
editor

