తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘క’. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమాకి అనుకున్న రేంజ్‌లో స్క్రీన్స్ దొరక్కపోయినప్పటికీ అదే సమయంలో విడుదలైన సినిమాలకి మంచి పోటీ ఇస్తోంది. విడుదలైన వారం రోజుల్లోన్లే ఈ సినిమా 32.64 కోట్లను కలెక్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాగా.. కిరణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాపై మొదటి నుండి ఎంతో నమ్మకంగా ఉన్న కిరణ్ చెప్పినట్టే సాలీడ్ హిట్ కొట్టాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది.

- November 6, 2024
0
28
Less than a minute
Tags:
You can share this post!
administrator