ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించని సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయింది. ఎట్టకేలకు ఈ వార్తలకి చెక్ పెట్టింది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతలోకి వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా రామాయణ సినిమా చేస్తోంది.
అయితే సాయి పల్లవి ఈ సినిమా కోసం తనకున్న అలవాట్లను మార్చుకుందని.. ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తునందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని.. పూర్తిగా వెజ్ మాత్రమే తింటోందని.. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది… ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ నాపై తప్పుడు పుకార్లు రాసినా, చెప్పినా, మౌనంగా ఉండబోనని, ఒకవేళ అలా జరిగితే కచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.