పాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఫొటోలు ట్రోల్ చేసి నా పరువు తీయకండి: సాయిపల్లవి

పాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఫొటోలు ట్రోల్ చేసి నా పరువు తీయకండి: సాయిపల్లవి

పాత ఫొటోలు ట్రోల్ చేసి నా పరువు తీయకండి: సాయిపల్లవి. అలాంటివి ట్రోల్ చేయడం వల్ల అవి చూసి చాలా బాధ వేసింది. సాయిపల్లవి అంటేనే.. సంప్రదాయబద్ధమైన భారతీయ స్త్రీ గుర్తుకొస్తుంది. తాను వేడుకల్లోనే కాదు, సినిమాల్లోనూ వేషధారణ విషయంలో ఎక్కడా లిమిట్స్ దాటలేదు. సాయిపల్లవి నటించిన ‘అమరన్‌’ సినిమా ఈ నెల 31న రిలీజ్‌కి సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది సాయిపల్లవి. ‘మెడిసిన్‌ చేయడానికి జార్జియా వెళ్లి అక్కడ టాంగో డ్యాన్స్‌ నేర్చుకున్నా. స్టేజ్‌పై ప్రదర్శన కూడా ఇచ్చా. కానీ ఈమధ్య ఉన్నట్టుండి జార్జియాలో నేను చేసిన టాంగో డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం మొదలైంది. అవి చూసి నిజంగా చాలా బాధపడ్డాను. దానిని ట్రోల్‌ చేసి, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని చూశారు అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

administrator

Related Articles