కొత్త సబ్జెక్ట్‌తో రాబోతున్న చిరంజీవి సినిమా..!

కొత్త సబ్జెక్ట్‌తో రాబోతున్న చిరంజీవి సినిమా..!

చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ విజువల్ ట్రీట్ సినిమా  “విశ్వంభర” అని మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా శరవేగంగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు దీనిపై నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన కెరీర్‌లో 157వ సినిమా చేయనున్నారు. ఇక తన నెక్స్ట్ సినిమాగా అయితే చిరు ఓ సాలిడ్ సబ్జెక్టుని చాలాకాలం తర్వాత టచ్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రముఖ నటుడు అలాగే రచయిత బివిఎస్ రవి రీసెంట్‌గా చిరంజీవి కోసం తాము ఒక సోషల్ సబ్జెక్టుని రెడీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో మళ్ళీ ఒక ఠాగూర్, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ట్రీట్‌ని మళ్ళీ చిరు నుండి ఆశిద్దామని చెప్పాలి.

administrator

Related Articles