సారంగపాణి జాతకం టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం. ఈ ఛాన్సిచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణకి థ్యాంక్స్. టాలీవుడ్లో వచ్చిన గొప్ప సినిమాల లిస్ట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ సినిమాలుంటాయి. రూప అందమైన నటి మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. అందుకే నేను కూడా ఆమె పక్కన బావున్నా. వెన్నెల కిషోర్, వైవా హర్షలతో మళ్లీ పనిచేయాలనుంది. ‘కోర్ట్’ తర్వాత నాకెరీర్‌కి ‘సారంగపాణి జాతకం’ ఓ వరం.’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ఆయన హీరోగా నటించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. రూపా కొడవయూర్ హీరోయిన్. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇదని, మంచి టాక్‌తో దూసుకుపోతున్నదని, ఫ్యామిలీతో ఈ సినిమా చూస్తే వచ్చే కిక్ వేరేలా ఉంటుందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ఇంకా హీరోయిన్ రూపా కొడవయూర్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, వైవా హర్ష, డీవోపీ పీజీ విందా కూడా మాట్లాడారు.
- April 28, 2025
0
143
Less than a minute
Tags:
You can share this post!
administrator

