Movie Muzz

కేసీఆర్ స‌భ‌లో మెరిసిన అల్లు అర్జున్ ఫ్లెక్సీలు..

కేసీఆర్ స‌భ‌లో మెరిసిన అల్లు అర్జున్ ఫ్లెక్సీలు..

హీరో అల్లు అర్జున్ క్రేజ్ అంత‌కంతకూ పెరిగిపోతోంది. రోజురోజుకీ బ‌న్నీ క్రేజ్ పెరుగుతుందే త‌ప్ప తగ్గ‌డం లేదు. ఇటీవ‌ల వ‌చ్చిన పుష్ప 2 సినిమాతో బన్నీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప‌2 త‌ర్వాత బ‌న్నీ క్రేజ్ విశ్వ‌వ్యాప్తం అయింది. స‌భలు, ఆట‌లు, ఈవెంట్స్ ఇలా ప్లేస్ ఏదైన స‌రే బ‌న్నీ అభిమానులు ఆయ‌న ఫ్లెక్సీల‌తో సంద‌డి చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాటు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. స‌భ‌లో అల్లుఅర్జున్ ఫ్లెక్సీల‌తో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంద‌డి చేశాయి. ఓ వైపు కేసీఆర్, మ‌రోవైపు బ‌న్నీ ఫొటోల‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. “కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్‌.. తగ్గేదేలే అంటూ ఆ ఫ్లెక్సీల‌పై రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను బీఆర్ఎస్ శ్రేణులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అల్లు అర్జున్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

administrator

Related Articles