తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విజయ్ బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ ర్యాలీలో ఊహించిన దానికంటే ఎక్కువమంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సమావేశం ద్వారా విజయ్ బాధిత కుటుంబాలకు తన మానసిక మద్దతు, సానుభూతి వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికీ విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనపై అజిత్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఘటనకి విజయ్‌తో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యులేనని అజిత్ స్పష్టం చేశారు. మీడియాతో పాటు ఫ్యాన్స్, ఇతరవర్గాలు కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలని పూర్తిగా నివారించాలంటూ అజిత్ పేర్కొన్నారు.
- November 1, 2025
0
37
Less than a minute
You can share this post!
editor

