క్రియేటివ్ ఫీలింగ్స్, న్యూ ఐడియాస్ ఉన్న వ్యక్తినే పెళ్లాడతా…

క్రియేటివ్ ఫీలింగ్స్, న్యూ ఐడియాస్ ఉన్న వ్యక్తినే పెళ్లాడతా…

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండటం ముఖ్యం కాదు. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. అదే ముఖ్యం. కాబోయే భర్త ఎలా ఉండాలి? తనకు ఎలాంటి గుణగణాలుండాలి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది చెన్నయ్‌ చందమామ శ్రుతిహాసన్‌. సృజనాత్మక భావాలు, స్పూర్తినింపే ఆలోచనలు మనిషికి ఆభరణాలు. ఈ లక్షణాలున్న వ్యక్తి కనపడితే, తనకూ నేను నచ్చితే.. తప్పకుండా పెళ్లాడతా. ఆదర్శవంతమైన భాగస్వామి ఎప్పుడూ నవ్విస్తూ సరదాగా ఉంటాడు.నేను అలాంటి వ్యక్తినే ఇష్టపడతా అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌. ఇదే ఇంటర్వ్యూలో మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అనడిగితే.. ‘ఇలాంటి ప్రశ్నలు నాకు నచ్చవ్‌. కానీ సమాధానం చెబుతా. నేను సింగిలే. ప్రస్తుతానికి నా రిలేషన్‌ కెరీర్‌తోనే’ నేను జీవితంలో ఎన్నో గోల్స్ సాధించాలి, అదే ధ్యేయం నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటాను అని తెలిపింది శ్రుతిహాసన్‌. దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్టు నాలుగేళ్ల క్రితం ప్రకటించిన శ్రుతిహాసన్‌.. ఇటీవలే అతనితో డిటాచ్‌గా ఉంటోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

administrator

Related Articles