అభిమానులు గర్వపడే సినిమా ఇది: సమంత

అభిమానులు గర్వపడే సినిమా ఇది: సమంత

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా గ్రాండ్‌గా విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. యాక్షన్, డ్రామా, కామెడీ, భావోద్వేగాలు అన్నీ సమపాళ్లలో ఉంటాయని ఆమె చెప్పారు. నందినీ రెడ్డి, రాజ్ నిడిమోరు పని విషయంలో ఎంతో పర్‌ఫెక్ట్‌గా ఉంటారని సమంత ప్రశంసించారు. అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందినీ రెడ్డి, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది.

Related Articles