‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం నుంచి విడుదలైన రెండో గీతం ‘వదలనే..’ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, పాటలోని భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. పాండిచ్చేరిలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ పాట గురించి హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ఒక ఎమోషనల్ సీన్ వినగానే తాను, దర్శకుడు రవి నంబూరి, హీరోయిన్ గౌరి ప్రియ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నామని తెలిపారు. ఈ పాటలోని కొన్ని విజువల్స్ తెలుగు సినిమాలో ఐకానిక్‌గా నిలుస్తాయని ఆయన అన్నారు. ‘వదలనే’ పాట థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులను వెంటాడుతుందని, సినిమా విజయానికి ఈ సాంగ్ పెద్ద హైలైట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.
- May 26, 2026
0
6
Less than a minute
You can share this post!
editor

