ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరో లుక్ నచ్చలేదని, ఇప్పటికే తీసిన సీన్స్‌ను రీషూట్ చేస్తున్నారని, షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పందించి క్లారిటీ ఇచ్చాయి. షూటింగ్ ఎక్కడా ఆగలేదని, ప్రస్తుతం ఉన్న విరామం కేవలం తదుపరి షెడ్యూల్ కోసం సాధారణ ప్రిపరేషన్ మాత్రమేనని వారు తెలిపారు. దీంతో ఫ్యాన్స్‌లో ఉన్న టెన్షన్ కొంత వరకు తగ్గింది. కానీ మరోవైపు రిలీజ్ డేట్‌పై సందేహాలు నెలకొన్నాయి. ముందుగా అనుకున్న జూన్ 25కి సినిమా రావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాలేదని సమాచారం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు కొత్త రిలీజ్ డేట్‌పైనే ఉంది.
- April 8, 2026
0
6
Less than a minute
You can share this post!
editor

