‘డైమండ్ డెకాయిట్’ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు K. Raghavendra Rao ట్రైలర్‌ను వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్ర బృందం మహిళలకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విడుదల రోజున థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. హీరోగా పార్ధా గోపాల్ నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, హీరోయిన్గా మేఘనా రెడ్డి కనిపించనున్నారు. దర్శకుడు సూర్య జి. యాదవ్ ఈ చిత్రాన్ని భావోద్వేగాలతో నింపిన కథతో తెరకెక్కించారు. కడప జిల్లాలోని 60కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే ప్రివ్యూ షోలలో మంచి స్పందన లభించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
- April 7, 2026
0
6
Less than a minute
You can share this post!
editor

