ఐఎఎస్ గోల్‌ను వీడి యాక్టర్ అయింది ఎవరో తెలుసా..

ఐఎఎస్ గోల్‌ను వీడి యాక్టర్ అయింది ఎవరో తెలుసా..

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న రాశీఖన్నాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విషయం నెట్టింట వైర‌ల్ అవుతోంది. న‌ట‌న అనేది త‌న గోల్ కాద‌ని, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఎన్నో క‌ల‌లు క‌న్నాన‌ని చెప్పుకొచ్చింది. చదువులో ఎప్పుడూ ముందు వరుసలో నిలిచిన ఈ ఢిల్లీ అమ్మాయి, జీవితంలో ట‌ర్నింగ్ పాయింట్స్ గురించి ఊహించలేదు. 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశి ఖన్నా, చిన్నప్పటి నుండే పాఠశాలలో టాపర్‌గా అన్నీ ఫస్ట్ మార్కులతో నిలిచేది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే కొంతకాలం యాడ్ ఏజెన్సీ కోసం కాపీ రైటింగ్ కూడా చేసింది. అదే సమయంలో ఐఏఎస్ కావాలన్న స్వప్నాన్ని గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగింది. కానీ జీవితంలో ఊహించని మలుపులతో నటనవైపు టర్న్ అయ్యింది.

editor

Related Articles