‘గత వైభవం’ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.

‘గత వైభవం’ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.

ఎస్‌.ఎస్‌. దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’ ఈ నెల 14న విడుదలకు సిద్ధమైంది. సింపుల్ సుని దర్శకత్వంలో, దీపక్ తిమ్మప్ప మరియు సుని నిర్మాణంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌, పాటలు భారీ ఆసక్తి రేపాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర అమెరికా, కెనడాలో ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి విడుదల చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున మాట్లాడుతూ, “ఆషికా ‘గత వైభవం’ గురించి చాలా ప్యాషన్‌తో చెబుతూనే ఉంది. ఈ సినిమాకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్‌, ఎమోషనల్ డ్రామాతో కూడిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోనుంది.

editor

Related Articles