ఆది, మేఘ, హనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బుల్లెట్ రెడ్డి’ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై ఆది దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో చిత్ర విశేషాలను ఆది వెల్లడించారు. ఈ సినిమాలో హీరో బుల్లెట్ రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు. అతనికి చెందాల్సిన లక్షల కోట్ల విలువైన నిధిని దక్కించుకునేందుకు కొందరు దురాశపరులు ప్రయత్నిస్తారు. ఆ కుట్రలను హీరో ఎలా ఎదుర్కొంటాడు అన్నది కథలో ప్రధాన అంశం. ఆదిలాబాద్ అడవుల్లో పాటల చిత్రీకరణ జరిపిన యూనిట్, నిజామాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కించింది. ఈ నెల 23 నుంచి రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తరువాత గోవాలో పాటల చిత్రీకరణ జరిపి, చివరి షెడ్యూల్‌ను మళ్లీ ఆదిలాబాద్, నిజామాబాద్‌లో పూర్తి చేస్తారు. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 16న సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
- March 12, 2026
0
4
Less than a minute
You can share this post!
editor


